
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
మోతె: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి చరణ్ (22), దోసపాటి కళ్యాణ్ (23) బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరణ్ ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. కళ్యాణ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.