పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి….

TEJA NEWS

పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి….

ధరల పెంపుపై సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నిరసన….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, గోదావరిఖనిలోని ఎన్టీపీసీ సెంటర్, 8వ కాలనీ షిర్కే బస్టాండ్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు తగ్గకపోవడం ఆందోళనకరమని అన్నారు.
ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత భారంగా మారుతోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గుర్తించి పెంచిన ఇంధన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ధరల పెంపును వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, పీవైఎల్ రాష్ట్ర యువజన నాయకులు భూసనవేణి కృష్ణ, ఈసంపల్లి రాజేందర్, మార్త రాములు, అరుణోదయ నాయకులు చిలుక రాజు, కలువల రాయమల్లు, తూళ్ల శంకర్, బుషిపాక దేవయ్య, మాటేటి పోషం, రవి, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top