భగత్ సింగ్ 94వ వర్ధంతి వారోత్సవాల పోస్టర్లను విడుదల చేసిన పి డి ఎస్ యు

TEJA NEWS

భగత్ సింగ్ 94వ వర్ధంతి వారోత్సవాల పోస్టర్లను విడుదల చేసిన పి డి ఎస్ యు

వనపర్తి

భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి వారోత్సవాలను మార్చి 23 నుండి 30 వరకు జరపాలని, వనపర్తి జిల్లా కేంద్రంలోని SC బాలుర కళాశాల హాస్టల్ వసతి గృహం లో శనివారం పిడిఎస్యు ఆధ్వర్యంలో (పోస్టర్లను) గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( PDSU) జిల్లా అధ్యక్షులు వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం దేశంలో ఉన్న విద్యార్థులు, యువకులు విప్లవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. *భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మరో స్వతంత్ర పోరాటానికి యువతీ, యువకులు, ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మతోన్మాద భావజాలాన్ని ప్రతి మనిషిలో చొప్పించడం కోసం బలవంతపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మనిషిని అణచివేస్తున్నారు.

నక్సలిజం పేరుతో అమాయకులైన ఆదివాసీలను, గిరిజనులను వందలాది మందిని తమ రక్షణ బలగాల చేత చంపి వేస్తున్నారు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, పాలకులు, రక్షణ బలగాలు నక్సలిజం పేరుతో ప్రజలను, ఆదివాసీలను, విద్యార్థులను, యువకులను, మేధావులను సైతం సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధిస్తూ, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం మారణ హోమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మతోన్మాద ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం, మోడీ అమిత్ షా ధ్వయం సాగిస్తున్న మారణకాండ కు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఈ దోపిడీ వ్యవస్థను కూల్చివేయడానికి సిద్ధపడాలని అన్నారు. అదే పోరాట స్ఫూర్తితో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను ఈ నెల 23 నుండి 30 వరకు గ్రామ గ్రామాన జరపాలని భగత్ సింగ్ అందించిన వారసత్వంలో దేశ రక్షణకై పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు తరుణ్, సంతోష్, ఆదికేశవ, రామ నాయుడు, కళ్యాణ్, కిషోర్,శివ, సురేష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top