ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం

TEJA NEWS

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— తన దృష్టికి వచ్చిన నియోజకవర్గ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

— ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top