అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కొత్త విగ్రహాలకు ఏర్పాట్లు : పద్మారావు గౌడ్

TEJA NEWS

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కొత్త విగ్రహాలకు ఏర్పాట్లు : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సీతాఫలమండీ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, వివిధ సంస్థలు సద్వినియోగం చేసుకొని మహనీయుల స్పూర్తి ప్రజలకు చేరేలా కృషి చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫలమండీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు జి. చంద్రశేఖర్ నేతృత్వంలోని కొత్త కమిటీ ప్రతినిధులు పద్మారావు గౌడ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. వారిని ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ అభినందించారు. అణగారిన వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తమ ప్రయత్నాలు అందరికీ చేర్చడంలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రశేఖర్ నేతృత్వంలోని కొత్త కమిటీ పేదల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో నేతలు గడ్డం ప్రసాద్, చలపతి, గిరి, కృష్ణ, లలిత, రాజేశ్వర్ రావు, గోవర్ధన్, విద్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top