ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

TEJA NEWS

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పై వచ్చిన 06 మంది భాదితుల సమస్యలను. డి .ఎస్పి మోగిలయ్యా, ఆలంపూర్, గద్వాల , శాంతి నగర్ సర్కిల్ అధికారుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో విచారణలో ఏలాంటి జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల లో
భూ వివాదాలకు సంబంధించి -02

కుటుంబ/ఇతర తగాదాలకు సంబందించి -02

ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు రావడం జరిగింది.

 జిల్లా పోలీస్ కార్యాలయం

జోగుళాంబ గద్వాల్ జిల్లా

You cannot copy content of this page

Scroll to Top