ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్

TEJA NEWS

ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్

🔶మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామరంలో ప్రభుత్వ భూములను గురువారం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు.
🔶గాజులరామరం గ్రామంలో క్వారీ లీజులు ముగిసినా అక్కడ నుంచి ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నిస్తున్నారు అనే ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
🔶 ఆ పక్కనే ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ కబ్జాలు కూడా పరిశీలించారు.
🔶 యిక్కడ దాదాపు 400ల వరకూ ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాలు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
🔶 దాదాపు 78 ఎకరాల వరకు లీజుకు తీసుకున్న వారితో వచ్చేవారం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
🔶 అనంతరం శేరిలింగంపల్లి మండలం నల్లగండ్ల చెరువు నాలా కబ్జాకు గురి అవుతుందన్న ఫిర్యాదులను పరిశీలించారు.
🔶 నాల విస్తీర్ణం తగ్గకుండా చూడాలని అక్కడ పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థను ఆదేశించారు.
🔶 నాలా విస్తీర్ణంతో పాటు బఫర్ జోన్ కు ఆటంకం రాకుండా నిర్మాణం చేపడతామని వెర్టెక్స్ వాళ్ళు హామీ యిచ్చారు.
🔶 తర్వాత గోపన్నపల్లి గ్రామంలో మే మేల్లకుంట కబ్జాకు గురి అవుతుందన్న ఫిర్యాదును కూడా పరిశీలించారు.
🔶 రాజేంద్రనగర్ మండలం పుప్పాల గూడలోని మామాసాని కుంట ను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
🔶 సర్వే నంబర్ల ప్రకారం చెరువు హద్దులపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో అధికారులతో సమీక్షించారు.

WhatsApp Image 2025 04 03 at 4.38.09 PM (1)
WhatsApp Image 2025 04 03 at 4.38.09 PM (1)

You cannot copy content of this page

Scroll to Top