వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన హైడ్రా.

TEJA NEWS

వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన హైడ్రా.
యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు

🔷ఈదురు గాలులతో పాటు వర్షానికి నేలకొరిగిన చెట్లను హైడ్రా DRF బృందాలు యుద్ధ ప్రాతిపదికన తొలగించాయి.
🔷పలుచోట్ల వరద నీరు నిలిచిపోగా తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు .
🔷వృక్షాలు పడిన ప్రాంతాలను, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నేరుగా పరిశీలించారు.
🔷ఖైరతాబాద్ సోమాజిగూడ RTA కార్యాలయానికి చేరువలో రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని 40 నిమిషాల్లో అక్కడి drf బృందాలు తొలగించాయి.
🔷సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్డు, ముషీరాబాద్, అసెంబ్లీ రోడ్డు, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో కూడా రోడ్డు కు అడ్డంగా పడిన వృక్షాలను తొలగించాయి.
🔷ఓల్డ్ అల్వాల్, ఎల్ బీ న గర్, బేగంపేట, మాదాపూర్, మేహిది పట్నం లోని NMDC వద్ద మోకాళ్లకు పైగా నిలిచిపోయిన వరద నీటిని హైడ్రా DRF బృందాలు తొలగించాయి.

WhatsApp Image 2025 04 03 at 10.16.37 PM
WhatsApp Image 2025 04 03 at 10.16.37 PM

You cannot copy content of this page

Scroll to Top