సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు

TEJA NEWS

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్. పార్టీ సర్వ సభ్య సమావేశo గురువారం సితాఫలమండీ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన BRS పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ పండుగను ఈ నెల 27 వ తేదీన ఘనంగా జరుపుకున్దామని అన్నారు. 27 వ తేదీన ఉదయం 10.00 గంటలకు అన్ని డివిజన్ లలో తోరణాలు, జెండాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి జెండాలను ఆవిష్కరించాలని కోరారు. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి KCR నాయకత్వాన్ని బలపర్చాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.

10 లక్షల మందితో ఎల్కతుర్తి సభను బీ.ఆర్.ఎస్. నాయకత్వం నిర్వహిస్తోందని, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీగా కార్యకర్తలు, జనం తరలి వెళ్ళాలని, అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధనగర్ డివిజన్ల నుంచి భారీగా వాహనాల్లో జనం తరలి వెళ్ళాలని, తను కూడా జనం వెంటే ఉంటానని తెలిపారు. 10 సంవత్సరాల BRS ప్రభుత్వ పాలనను చూసిన ప్రజలు మళ్ళీ KCR ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. 16 నెలల పాలనతోనే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తో విసిగిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని కోరారు. కార్పొరేటర్లు కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, సామల హేమ, రాసురి సునీత రమేష్, నేతలు ఆలకుంట హరి, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, కంది నారాయణ, గుర్రం పవన్ కుమార్ గౌడ్, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top