ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా, శిల్ప బృందావన్

TEJA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా, శిల్ప బృందావన్, మహంకాళి నగర్, ఛత్రపతి శివాజీ నగర్ కాలనీల లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో వరద నీటి కాల్వ ,డ్రైనేజి వ్యవస్థ ను మరియు మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, PAC చైర్మన్ గాంధీ దృష్టికి తీసుకు రావడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగినది అని, వరద నీటి కాల్వ ఔట్ లెట్ లో పెరుకపోయిన చెత్త చెదారం తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, ఓపెన్ నాలలో మరియు వరద నీటి కాల్వ లో పూడికతీత పనులు త్వరితగతిన చేపట్టి రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపు కు గురికాకుండా ఇప్పటినుంచే తక్షణ చర్యలు చేపట్టాలని, చెత్త చెదారం తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని, వరద నీటి కాల్వ లో మురుగు నీరు కలవకుండా ప్రత్యేకంగా మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమున్న చోట UGD పైప్ లైన్ నిర్మాణము చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.

అదేవిధంగా కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకుందాం అని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, కాలనీ లో మంచి వాతావరణం కల్పిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు , మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని, సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి గాని కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, జలమండలి అధికారులు మేనేజర్ ఝాన్సీ మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top