124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్లో మెయిన్ రోడ్డు మరియు రోడ్డు నెంబర్ 2 లో సీసీ రోడ్లు లేక సమస్యగా ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి కాలనీ కి వెళ్లి సమస్యను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తైయ్యాయి కాబట్టి ఈస్ట్ సాయి నగర్ కాలనీ లో సీసీ రోడ్లు నిర్మిచవలసి ఉందని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన రాంపులను కాలనీ వారితో మాట్లాడి తొలగించి రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెడతామని అన్నారు. విషయాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ. సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ కి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఇనాగ్రేషన్ చేసి రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, రాజారెడ్డి, తిరుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, నర్సయ్య, బాలీశ్వర్, సతీష్, కోటేశ్వరరావు, ప్రసాద్, పార్వతీశం, ఇంద్రారెడ్డి, కొండలరావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
