పిల్లలమర్రిలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్ర వేడుకలు

TEJA NEWS

పిల్లలమర్రిలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్ర వేడుకలు

సూర్యపేట జిల్లా : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉదయం శ్రీ భగవత్ రామానుజాచార్యుల స్వామి తిరు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి తదుపరి విశేష పూజలు నిర్వహించారు.మహిళా భక్తులచే శ్రీ మహా లక్ష్మీ విగ్రహానికి కుంకుమార్చన చేయించి తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్ ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు భక్తులు అంకం భిక్షం, ముడుంభై సారిక,గవ్వ విజయ లక్ష్మీ,అహల్య,సువర్ణ,దేవరశెట్టి అనిత,సునంద, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top