శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన

TEJA NEWS

శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ భోర్ఖడే IAS ని, డిప్యూటీ కమీషనర్ వి ప్రశాంతి LLB, MBA ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలబొకే ఇచ్చి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమీషనర్ తో చర్చించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top