ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌

TEJA NEWS

ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌

  • ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ప్ర‌భుత్వ ధ్యేయం
  • శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌
    (శ్రీ‌కాకుళం)
    శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజ‌క‌వ‌ర్గంలోని గార, శ్రీ‌కాకుళం రూర‌ల్ మండ‌లం, శ్రీ‌కాకుళం టౌన్ నుంచి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు విశాఖ ఎ కాల‌నీలోని ఎమ్మెల్యే కార్యాల‌యానికి చేరుకొని విన‌తుల‌ను శుక్రవారం అంద‌జేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కారం మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు.
  • ముఖ్యంగా గ‌త ఐదేళ్ల‌లో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌క పోవ‌డంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి ద‌ర‌ఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్‌, డ్రైన్లు, సాగునీరు త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి విన‌తులు అందుతున్నాయ‌ని వాటిని ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించి ప‌రిష్కించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వ పాల‌న‌లో సంక్షేమం, అభివృద్ధి స‌మాంత‌రంగా నిర్వ‌హిస్తున్నామ‌ని గ‌త 10 నెల‌ల్లోనే ప్ర‌జాప్ర‌భుత్వంగా ప్ర‌జ‌ల‌తో మ‌న్న‌న‌లు అందుకున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల అభివృద్ధికి, అభ్యున్న‌తికి ప్రాధాన్య‌త‌నిస్తూ ముందుకు సాగుతున్నామ‌ని శంక‌ర్ వివ‌రించారు. ఇళ్లు కావాల‌ని పెద్ద ఎత్తున విన‌తులు అందుతున్నాయ‌ని రాష్ట్ర మంత్రి దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకెళ్లి ఒక ప్ర‌ణాళిక రూపొందిస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top