రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

TEJA NEWS

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకో వాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించామని, వాటి వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. బి.ఎల్. ఓ.లు ఇంటింటి సర్వే చేసి నివాసాలు మారిన వివరాలు సేకరించి ఫారం-8 అప్లై చేశామని, ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ప్రతినిధులను కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన గడువు లోపు పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకో వాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top