60 లక్షల రూపాయలతో బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాల ఆధునీకరణ

TEJA NEWS

60 లక్షల రూపాయలతో బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాల ఆధునీకరణ..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బొల్లారం మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 60 లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో ఆధునికరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పాఠశాలలను పరిశీలించారు. సమస్యలను స్వయంగా పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 60 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునికరించినందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా పాఠశాలకు పూర్తిస్థాయిలో రంగులు వేయడంతో పాటు.. గ్రౌండ్ లెవెలింగ్, క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.

You cannot copy content of this page

Scroll to Top