ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచనలతో
పట్టణంలొ తొలగిన మంచినీటి ఇబ్బందులు
నందిగామ పట్టణానికి అపర భగీరధుడు
మంచి నీటిని ఒడిసిపట్టి
వేసవిలో సత్ఫలితాలు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ముందు చూపు
సక్రమంగా అన్ని వార్డులకు త్రాగునీరు
గతం కంటే మెరుగైన మంచినీటి సరఫరా
నందిగామ పట్టణంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి వేసవికాలంలో మంచినీళ్లు భూగర్భ జలాలు అడుగంటి మంచినీళ్ల కోసం ట్రాక్టర్లను పెట్టి మంచినీటిని కొనుక్కున్న అపార్ట్మెంట్ వాసులకు ,పట్టణ ఁపజలకు నేటి వేసవికాలంలో ఆ బాధ లేకుండా పోయింది.
గతంలో ఎండాకాలంలో వార్డుల్లో వారం, పది రోజులకు ఒకసారి వచ్చే మంచినీరు నేడు రోజు విడిచి రోజు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు పట్టణ వాసులు….
గత డిసెంబర్ నుండే నందిగామ పట్టణ వాసులకు వేసవికాలంలో తాగునీరు ఇబ్బంది రాకూడదు అనే కృతనిశ్చయంతో తాగునీటి సమస్య పరిష్కారానికి రూపకల్పన చేశారు కమిషనర్ ఇ.వి రమణబాబు*
2.50కోట్ల రూపాయలతో నగరంలో మారుమూల ప్రాంతాలలో పైప్ లైన్లకు కొత్త వాల్ ఏర్పాటు చేసి, షిఫ్ట్ వారిగా మంచినీటి సరఫరా చేయడం ,ఆర్ అండ్ బి రోడ్ లో ఉన్నటువంటి వాల్స్ మార్చడం ,కీసర మునేరు స్కీముల దగ్గర అదనంగా కొత్త బోర్లు వేసి పానెల్స్ వేసి స్విచ్ బోర్డులు ఏర్పాటుచేయడం ,డివిఆర్ కాలనీ ,ముక్కపాటి కాలనీ, హరిజనవాడ, రైతుపేట కొంత భాగం పైప్ లైన్ వేయడం జరిగింది.
ప్రధాన వీధులన్నింటికీ పైప్ లైన్స్ వేయడం మంచినీటి స్కీముల వద్ద అదనంగా బోర్ లైన్ వేయడం పైప్, రైతు పేట సిఎమ్ రోడ్ ,డివిఆర్ కాలనీలో ప్తెప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయించి ప్రజలకు మంచినీటి సరఫరాలు అంతరాయం లేకుండా చూడటం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలు నుండి వచ్చిన సమస్యలనుఎప్పటికప్పడు కమిషనర్ పరిష్కరించడం జరిగింది.
జనవరిలోనే కీసర, మునేటిలో నీటి ప్రవాహానికి ఆనకట్ట వేసి నీటిని (నిలవజేసి ఇంకుడు గుంటల్లా) కొత్త బోర్లను భూమిలోకి దించడంతో ఇప్పుడు ఆ నీరు నందిగామకు వరప్రదాయంగా మారి నీటి కొరత లేకుండా ఉంది.
మున్సిపాలిటీకి ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే బాధ తప్పి మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదా అయింది..
ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి మినరల్ వాటర్ కొనుక్కునే బాధ తప్పింది ఇన్ని సమస్యలను అధిగమించి రేయింబవళ్ళు కష్ణపడిన నందిగామ మున్సిపాలిటీ పట్టణ కమిషనర్ ఇ.వి రమణబాబు, ఇంజనీరింగ్ సిబ్బంది అభినందనీయులు..
