యంగంపల్లి లో డంపింగ్ యార్డ్ లు అలంకారంగా దర్శనమిస్తున్నాయి
- చెత్తను కాల్చేచేస్తున్న సిబ్బంది
– నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధి యంగంపల్లి గ్రామంలో ప్రజల ఆరోగ్యంతో పాటు పంచాయితీలకు అదనపు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ని అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి.యంగంప ల్లి గ్రామపంచాయతీ నిర్వాహకులు డంపింగ్ యార్డ్ లో చెత్తను కాల్చివేయడం జరుగుతుంది. పక్కనే రేకుల షెడ్డు నిర్మించినప్పటికీ వాటిని గాలికి వదిలి వేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజాధనం వృధాగా మారింది. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేయాల్సి ఉండగా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. నిధులు లేక పారిశుద్ధ్య కార్మికుల కొరతతో లక్ష్యం నెరవేయడం లేదు. ఒక్క షెడ్డు నిర్మాణానికి రూ “2.50 లక్షలు ఖర్చు చేశారు. పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ లోపంతో ఈ పథకం నీరుగారిపోయింది. సేంద్రియ ఎరువు తయారు చేయడం కోసం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి.
చెత్తను కాల్చేచేస్తున్న సిబ్బంది పర్యవేక్షణ ఎక్కడ..?
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద తడి పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేయాలి. ఇలా తయారు చేసిన ఎరువులను రైతులకు విక్రయించి గ్రామపంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇది నీరు గారుతుంది. చెత్త సేకరణ వరకే సక్రమంగా సాగుతుండగా దానిని వేరు చేసి వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు.ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా తీసుకోవడం డంపింగ్ యార్డ్ లో డంప్ చేస్తున్నారు. తడి పొడి చెత్తని వేరు చేయకుండా కాల్చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇదేవిధంగా కొనసాగుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పూర్తిస్థాయిలో విఫలం అవ్వడానికి కారణం గ్రామ పంచాయతీలో సిబ్బంది కొరత సిబ్బంది తక్కువగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శులపై పని భారం ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా చాలా చోట్ల నీటి వసతే లేదు. ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారులు చొరవ చూపి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.
