సరళ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటి కాలువలను మరమ్మతులు

TEJA NEWS

సరళ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటి కాలువలను మరమ్మతులు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన………. ఆర్టిఐ యాక్టి విస్ట్ జిల్లా అధ్యక్షులు రవికుమార్


వనపర్తి జిల్లా మదనాపురం మండలం పరిధిలోని
సరళ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు సాగునీటి కాలువలకు వెంటనే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి సమాచార హక్కు చట్ట ఆక్టివిస్ట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు జి.రవికుమార్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వానాకాలం ప్రారంభమౌతోందని ఆయకట్టు పరిధిలోని మదనాపురం,నెల్విడి, తిర్మలయాపల్లి,రామన్ పాడ్,ఆజ్జకొల్లు గ్రామంలో సాగునీటి కాలువలకు గతంలో చాలా చోట్ల లైనింగ్ దెబ్బతిని ధ్వంసం అయినాయని వెల్లడించారు.కాలువలో పూడిక పేరుకుపోయి,కొట్టుకుపోయిన కాల్వలకు మరమ్మతులు ఎప్పుడు చేపడతారొనని సాగుకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారన్నారు.వెంటనే మరమ్మతులకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారన్నారు.కాల్వలకు కొన్ని ఏళ్ల కిందట వేసిన సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినడం ప్రవాహ ఉద్ధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయని గుర్తు చేశారు.రైతులే సొంత ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు చేసుకొని, పంటలు కాపాడుకుంటున్నారన్నారు.ప్రతి ఏటా చివరి భూములకు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని,పంట కాలువలకు వచ్చే చిన్న చిన్న మరమ్మతులు వెంటనే నిర్వహించి చివరి వరకూ సాగునీరు అందేలా చూడాలన్నారు.వెంటనే అధికారులు దృష్టి సారించి పనులు చేపట్టాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top