** ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమావేశం

TEJA NEWS


వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామ
జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల మరియు ప్రాథమి కొన్నత పాఠశాలలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమావేశం జరిగింది. *ఈసందర్భభంగా ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వెసే భాద్యత మాది అన్నారు. ఈ పోటి ప్రపంచములో చదువంటే కేవలం బట్టి పట్టించి సమాధానములు వల్లెవేయడం కాదు.ఆటలు, పాటలు, మాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక పరిపక్వత తదితర అన్ని రంగాలలో తర్ఫీదు నివ్వడం ద్వారా మీ పిల్లలు ఆత్మన్యూనత భావానికి లోనూ కాకుండా పరిపూర్ణ శక్తి గా తీర్చి దిద్దబడాలి. పై పై మెరుగులకు బ్రమపడకండి. శోధించి సాధించేలా మీ పిల్లలు ఎదగాలంటే మన *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల*యాపర్ల 6వ నుంచి *10వ తరగతి వరకు, 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తే చాలు, మీపిల్లలను తీర్చి దిద్దే బాధ్యత మాదహామి ఇస్తున్నాంవేలకు వేలు కట్టి ఇప్పుడే మీ ఆర్థిక వనరులను ధ్వంసం చేసుకోకండి *ప్రభుత్వం వారు ప్రభుత్వ బడిలో *. ఉదయం పూట రాగిజావ, మధ్యాహ్నం పౌష్టికాహారం తో భోజనం, తెలుగు, ఇంగ్లీషు మీడియం లలో అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచే భోధన, ఎలాంటి ఫీజులు వసూలు చేయము మీ పిల్లల భవిష్యత్ మన ప్రభుత్వ బడి యాపర్ల లో రూపుదిద్దుకుంటుంది. వివిధ రకాల పోటీలు ఆటలు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఉచితంగా స్నాక్స్ అందిస్తాము. ఉచిత పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్. అత్యాధునిక డిజిటల్ ప్యానెల్స్ ద్వారా భోధన. సుదూర ప్రాంతాల విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం,రవాణా ఛార్జీలు చెల్లింపు. సర్కారు బడి మన గ్రామం లో ఉండగా, ఎక్కడో 20,30, కి.మీ సుదూర తీరాలకు ప్రైవేట్ పాఠశాలకు పంపుట ఎందుకు దండగ. దీనికీ తోడుగా మన పాఠశాలలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ ఏర్పట్టు చేసిన్నాము. స్టూడెంట్స్ లైబ్రరీ లో కథల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, చదవడానికి లైబ్రరీ , సైన్స్ ల్యాబ్ ద్వార విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు ఒకసారి మన ఊరి స్కూల్ ను సందర్శించండి ఆలోచించి మన గ్రామంలోని స్టూడెంట్స్ ను మన గ్రామంలోని బడిలో చేర్చండి అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బుచ్చమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషేన్, భాగ్యలక్ష్మి,ఉపాధ్యాయులు మొహినొద్దీన్ ఈశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షుడు గోకరయ్య, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు స్వరాజ్జంబాబు రెడ్డి ,ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు దామోదర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. *

You cannot copy content of this page

Scroll to Top