TEJA NEWS

భక్తి శ్రద్దలతో గంగమ్మకు రెండవ మరు పొంగళ్ళు

** ఆకట్టుకున్న కళాకారుల వేషధారణలు

తిరుపతి: రాష్ట్రంలోనే పేరుగాంచిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ముగిసిన రెండవ మంగళవారం మరు పొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈఓ జయకుమార్ కొనియాడారు.

ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తరువాత జరిగే 5 వారాల మరుపొంగళ్లలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఇర్ల గుణశేఖర్, జయమ్మ, , చెంగల్ రాయులు, వాసు, దేశ నాగేశ్వరరావు, మేకల గంగయ్య, వెంకటేశ్వర స్వామి వేషధారణగా మోహన్ రెడ్డి, అష్టలక్ష్మిలుగా శ్రీలక్ష్మి, రమ, లలిత, నాగశ్రీ, ఉమాదేవి, శ్రీవాణి, పార్వతి, సరళ, పురాణ పురుషుల పాత్రలలో మురళీకృష్ణ, వెంకటాచార్యులు, వినోద్ కుమార్, గురుతేజ, రమణారెడ్డి, గోపాల్ రావు, భాస్కరాచారి, మునినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top