హైదరాబాద్: రాజీవ్ యువవికాసంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. జూన్ 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని, అక్టోబర్ 2 నాటికి 5లక్షల మందికి దశలవారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక వేసినట్లు తెలిపారు. తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు.
