నగరపాలక సంస్థ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్గీయ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్ర పటానికి కమిషనర్ ఎన్.మౌర్య, స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ , కార్పొరేటర్ నారాయణ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, తదితరులు పాల్గొన్నారు.
