స్విమ్స్ ఏర్పాటుతో ఎన్టీఆర్ దేవుడయ్యారు

TEJA NEWS

స్విమ్స్ ఏర్పాటుతో ఎన్టీఆర్ దేవుడయ్యారు

** 102వ జయంతి వేడుకల్లో స్విమ్స్ డైరెక్టర్

తిరుపతి: రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించేలా తిరుపతిలో “స్విమ్స్” ఆస్పత్రిని ఏర్పాటు చేయడంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల్లో దేవుడిలా నిలిచిపోయారని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ అన్నారు. 102వ ఎన్టీఆర్ జయంతిని పురష్కరించుకుని బుధవారం స్విమ్స్ ఆవరణలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సర్గీయ ఎన్.టి.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ మాట్లాడుతూ… ఎన్.టి.ఆర్. చొరవతోనే మన స్విమ్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, స్విమ్స్ కు వచ్చే పేషంట్ల కోసం ఆత్యాధునిక వైద్య సౌకర్యాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ నిశ్చయంతో వున్నారనీ తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఇటీవల జరిపిన బోర్డు సమావేశంలో స్విమ్స్ కు 71 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయడం జరిగిందని, స్విమ్స్ కు నిధులు మంజూరు చేసిన టి.టి.డి. చైర్మన్ బి.ఆర్.నాయుడుకి, ఇ.ఓ. జె.శ్యామల రావు, జె.ఇ.ఓ. వీరబ్రహ్మం లకు ధన్యవాదములు తెలిపారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్లు ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేసి స్విమ్స్ ను ఆత్యాధునిక వైద్య సౌకర్యాలతో పేద ప్రజలకు వైద్యం అందేలా తీర్చిదిద్దుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్ (పర్చేస్) దిలీప్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, సిఎఓ దేవరకొండ గోపి, ఎ.డి-పి.ఆర్ రాజశేఖర్, జనరల్ మేనేజర్ రవీంద్ర, నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత, ఎం.ఎస్.డబ్ల్యూ ప్రసాద్ రెడ్డి, స్విమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వి. బాబు సురేష్, పసల రామూర్తి, మురళీ క్రిష్ణా, నాగప్రసూన, బెనర్జీ, శివయ్య ఇతర నాయకులు, సిబ్బంది, సెక్యూరిటీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top