సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక్క వరం అన్న ఎమ్మెల్యే నాగరాజు గారు…
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం…
పార్టీలకు అతీతంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తున్నామన్న ఎమ్మెల్యే నాగరాజు ..
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక్క వరంగా మారిందని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు హాసన్పర్తి ప్రాంతానికి చెందిన జీర సదానందం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వచ్చిన 1,36,000 చెక్కును లబ్ధిదారునికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి అర్హులందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నట్టుగా ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు…..
