అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

TEJA NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..
పథకాల కోసం దళారులను ఆశ్రయించవద్దు..
జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

పటాన్చెరు; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎంపికను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పథకాల అమలుపై ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటి కలలు సాకారం చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. నియోజకవర్గం వ్యక్తంగా 3500 ఇల్లు మంజూరు కాగా.. మొదటి విడతలో 1032 లబ్ధిదారులకు నిధుల మంజూరి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. నేటి నుండి నియోజకవర్గంగా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇల్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులందరూ ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ 50 వేల నుండి నాలుగు లక్షల రూపాయల రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. జూన్ రెండున 50 వేల మరియు లక్ష రూపాయల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు అందజేయబోతున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top