ఆసుపాక పోస్టుమాస్టర్ శశాంక్ సస్పెండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వరావుపేట మండలం, ఆస్పాక గ్రామంలో ఏడాది నుంచి పోస్ట్ ఆఫీస్ కు వచ్చిన ఉత్తరాలు,ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు ఇతర పోస్టర్లను పంపిణీ చేయకపోవడంతో అశ్వారావుపేట ఎస్పిఎం సాయికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆసుపాక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శశాంకుపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోస్ట్ కార్డులను ప్రజలకు అందించలేదని తేలడంతో సస్పెండ్ చేసినట్లుగా పాల్వంచ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి తెలిపారు.
