వనపర్తి పట్టణం నుండి పెబ్బేరు పానగల్ వెళ్లే రహదారుల విస్తరణ

TEJA NEWS

వనపర్తి పట్టణం నుండి పెబ్బేరు పానగల్ వెళ్లే రహదారుల విస్తరణ పనులను ప్రారంభించాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి పట్టణం నుండి పెబ్బేరు, పాన్ గల్ వెళ్ళే రహదారుల విస్తరణ పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో రోడ్డు విస్తరణ పై సంబందించిన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు చాలా జాప్యం జరుగుతుందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవన నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయే వారికి టి.డి.ఎస్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్ లు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో నాలుగింతలు లాభం ఉంటుందని అందువల్ల టి.డి.ఆర్ పై అవగాహన కల్పించాలని సూచించారు. టి.డి. ఆర్ అనేది భూమి కోల్పోయే యజమానులకు బాండ్ రూపంలో ఇప్పుడు మార్కెట్ విలువను బట్టి ఇస్తారని ఇది మార్కెట్ పెరిగే కొద్ది విలువ పెరుగుతూ నాలుగింతలు లాభం ఉంటుందని వివరించారు.
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ను సూచించారు.
రోడ్డు విస్తరణ పనులు మాత్రం తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, రోడ్లు భవనాల కార్య నిర్వాహక ఇంజనీర్ దేశ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top