ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే

TEJA NEWS

ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత – ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.పార్టీ విప్ కె.పి.వివేకానంద..

ప్రజలకు మరింత దగ్గరగా ఉండే లక్ష్యంతో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తన నివాసంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజలతో అందుబాటులో వుంటారు. ఈ సందర్భంగా వివిధ కాలనీలు, బస్తీల నుండి ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు ఎమ్మెల్యే కి వివరించారు.

ప్రజలు సూచించిన సమస్యల్లో ప్రధానంగా రోడ్డు మరమ్మతులు, డ్రైనేజ్ సమస్యలు, పింఛన్ దరఖాస్తులు, ఆరోగ్య బీమా సేవలు మొదలైనవి ఉన్నాయి. ఎమ్మెల్యే వాటిని ఓర్పుతో విని సంబంధిత శాఖాధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తనకు నేరుగా తెలియడం వల్ల వెంటనే స్పందించగలుగుతున్నానీ, తన ఇంటి తలుపులు ప్రజలకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని, సేవే నా లక్ష్యం అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘం నాయకులు-సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కి చెప్పడానికి అవకాశం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top