శ్రీ బాల మురుగన్ దేవాలయం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే

TEJA NEWS

శ్రీ బాల మురుగన్ దేవాలయం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్ హాజరు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత : 130 సుభాష్ నగర్ డివిజన్ ఫాక్స్ సాగర్ వద్ద వెలచియున్న శ్రీ బాల మురుగన్ దేవాలయం యొక్క ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.

ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్. పార్టీ విప్, ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్ హాజరై, స్వామివారి ఆశీర్వవచనాలను పొందారు.

వార్షికోత్సవం సందర్భంగా మంగళ వాద్యం, విఘ్నేశ్వర పూజ, గణపతి హోమం, రుద్ర హోమం, అస్త్ర హోమం మరియు శివ-నాగ దేవతల విగ్రహ ప్రతిష్ఠ వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రాజు, కటింగ్ శ్రీను, దుర్గా రావు, అడపా శేషు, ఆలయ కమిటీ సభ్యులు కోట స్వామి, గణేశన్, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు, స్థానికులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top