మన చేతి రాత మన భవిష్యత్తుకు మూలం
వనపర్తి
మన చేతి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచే తమ చేతి రాతను అభివృద్ధి పరచుకోవాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. స్థానిక రేడియంట్ హై స్కూల్ లో జరిగిన చేతిరాత శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని . మాట్లాడుతూ
న్యూ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో పదిరోజుల పాటు చిన్న పిల్లలకు చేతిరాత నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమo జరిగింది.డెబ్బై మందికి పైగా విద్యార్థులు ఇందులో తమ చేతి రాతను అభివృద్ధి పరుచుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలు చేతిరాతలో స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడమే గాక ఏకాగ్రతను కూడా పెంపొందించుకోవచ్చుని అని పేర్కొన్నారు.పిల్లల అభ్యున్నతి కోసం తల్లి దండ్రులు తీసుకుంటున్న శ్రద్ధను కూడా ఆయన కొనియాడారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో చక్కటి చేతిరాతను సాధన చేసిన విద్యార్థులు సన , రింష,దీక్షలను,గురువు తరుణ్ కుమార్ లను కళా వేదిక సభ్యులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు . నిర్వాహకులు శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈనాటి కార్యక్రమంలో డిసిఇబి జిల్లా సెక్రటరీ సూర చంద్ర శేఖర్, దేశి రాములు యాదవ్,బైరోజు చంద్ర శేఖర్,రమేష్, కృష్ణవేణి నికిత నుశ్రత్ విద్యార్థుల తల్లి దండ్రులు మున్నగువారు పాల్గొన్నారు.
