ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపైన నిత్యం చెత్త వేయడం

TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపైన నిత్యం చెత్త వేయడంతో అక్కడ చెత్త పెరుకుపోవడాన్ని గమనించిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ జి.ఎచ్.ఎం.సి సిబ్బందికి రాత్రి సమయంలో సమాచారం అందించి, తక్షణమే చెత్తను శుభ్రంచేయించడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ చెత్తను వీధుల్లోనూ, కాలువలోను, చెరువుల్లోనూ, రోడ్లమీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు సహకరించి, మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా చూసుకోవాలని తెలియచేసారు.

You cannot copy content of this page

Scroll to Top