బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

TEJA NEWS

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

అమృత్‌సర్ : పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్ సాహిజ్ జిల్లాలో బాణా సంచా తయారీ కేంద్రంలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటన లో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేప ట్టారు. అందులోభాగంగా క్షతగాత్రులను జిల్లా ప్రభు త్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించామని డీఎస్పీ జస్పాల్ సింగ్ తెలిపారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నా యని చెప్పారు. సింగ్వాలీ – కోట్లి రహదారి సమీపంలోని ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింద న్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఈ పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారంతా వలస కార్మికుల ను వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top