పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

TEJA NEWS

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రసంగంలోని ముఖ్యంశాలు

ఆదివాసీల పోరాట యోధుడు బిర్సా ముండా స్ఫూర్తితో, మాహత్మ గాంధీ జయంతి రోజు న ప్రారంభించుకున్న Dhari Aaba Janjatiya Gram Utkarsh Abhiyam (DA-JGUA)

స్కీం కింద ట్రైబ‌ల్ ప్రాంతాల్లో అభివృద్ది కోసం, విద్య వైద్యం, జీవ‌నోపాధి, మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం 17 లైన్ డిపార్ట‌మెంట్ల‌ను సమ‌న్వ‌యం చేసే ప్ర‌య‌త్నం అభినంద‌నీయం

63 వేల 843 గ్రామాలు, 5 కోట్ల మంది ఎస్టీల కోసం ఏటా 15830 కోట్ల‌ను ఖ‌ర్చు చేసేందుకు కేంద్రం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం

అయితే ఈ మ‌ద్య తెలంగాణ ప్ర‌భుత్వం గిరిజ‌నులు, ఆదివాసీ ప్రాంతాలు, ఎజెన్సీ ఏరియాల అభివృద్ది కోసం రాష్ట్రంలో ప‌లు శాఖ‌ల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించాం.

ఎస్టీ పాపులేష‌న్ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాం. ప్ర‌జా సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాం.

నా అనుభ‌వాలు, వారి అభిప్రాయాల సారంశం ఒక్క‌టే. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల కృషి, కేంద్ర ప్ర‌భుత్వాల చేయుత కార‌ణంగా మైధాన ప్రాంతాల్లోని ఎస్టీలు అభివృద్ది చెందుతున్నారు.

కాని ఎజెన్సీ ఏరియాల్లోని ఆదివాసీలు, ప్రిమిటివ్ ట్రైబ్స్ అభివృద్దికి అటంకాలు ఎదుర‌వుతున్నాయి.

వారి అభివృద్ది ప‌ట్ల మాకు చిత్త శుద్ది ఉన్నా అట‌వి చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాలు ప్ర‌ధాన అడ్డంకిగా మారాయి.

అట‌వి శాఖ అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా అభివృద్ది ముందుకు సాగ‌డం లేదు.

1980 కి ముందున్న గ్రామాల్లో అభివృద్దికి అడ్డు చెప్పోద్ద‌ని అట‌వి చ‌ట్టాలు చెబుతున్నా..కేంద్ర ప్ర‌భుత్వం నుంచి చ‌ర్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్న భ‌యంతో ఫారెస్టు అధికారులు అభివృద్ది ప‌నులు ముందుకు సాగ‌డం లేదు.

అభివృద్ది వ‌ర్సెస్ అన్న అట‌వి చ‌ట్టాలు అన్న‌ట్లుగా ప‌రిస్తితి మారింది.

దానికి నా ములుగు నియోజ‌క‌వ‌ర్గ‌మే బెస్ట్ ఎగ్జాంపుల్. ములుగులో 77% ఫారెస్ట్ ఉంది. అందుకే ములుగును ట్రైబల్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ గా పిలుస్తారు. అక్కడ కూడా అభివృద్ధికి అటవీశాఖ అభ్యంతరాలు పెడుతుంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ కోరినట్లుగా క‌నీసం మంచి నీల్లు, క‌నీస రోడ్లు వేయ‌లేక‌పోతున్నాం.

గుడిసెల్లో ఉన్న పాఠ‌శాల‌కు పక్కా భ‌వ‌నాలు నిర్మిద్దామ‌నుకున్నా అట‌వి అనుమ‌తులు రావ‌డం లేదు.

అంగ‌న్ వాడీకేంద్రాలు, ఆసుప‌త్రులు, నిర్మిద్దామ‌న్నా అనుమ‌తులు రావడం లేదు.

దీంతో చేసేదేం లేక త‌ప్ప‌ని స‌రి ప‌రిస్తితుల్లో కంటెన‌ర్ స్కూల్ల‌ను, ఆసుప‌త్రుల‌ను అందుబాటులోకి తెచ్చాం.

అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు నూతన ఆలోచనతో తాత్కాలిక కంటైనరులను సమ్మక్క- సారలమ్మ తాడ్వాయి మండలంలో పోచాపుర్ లో, వాజెడు మండలం లోని ఏడ్చర్లపల్లిలో నిర్మాణం చేయడం జరిగినది.

ప్ర‌తి గ్రామానికి మ‌నం క‌రెంటు ఇచ్చామ‌ని గొప్ప‌లు చెప్పుకున్నా ఇప్ప‌టికి అట‌వి గ్రామాల‌కు క‌రెంటు లేదు. ఐటీడీఏ ఏటూరు నాగరం అధికారులు సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేశారు.

అక్క‌డ ఆదివాసీ గిరిజ‌నులు ఉద‌యం త‌మ మోబైల్ల‌ను చార్జింగ్ పెట్టుకుని..రాత్రి టార్చి లైట్లుగా వినియోగించుకుంటున్నారు.

మంచి నీల్ల బోర్లు కూడా వేయ‌నీయ‌డం లేదు.

అందుకే ఎజెన్సీ ప్రాంత ఎస్టీల అభివృద్దికి అట‌వి శాఖ సహ‌క‌రించేలా కేంద్రం చొర‌వ చూపాలి.

అడ‌వి కావాలి..అభివృద్ది కావాలి. ఒక‌దానికి మ‌రోక‌టి వ్య‌తిరేకం కాదు. అప్పుడే మ‌నం అనుకున్నDharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లం.

స‌ర్వోద‌య అన్నా, అంత్యోద‌య అన్నా..అభివృద్దిలో చిట్ట చివ‌ర ఉన్న వ్య‌క్తికి సంక్షేమ ఫ‌లాలు చేరాలి. చిట్ట చివరి ఆవాసానికి అభివృద్ధి చేరాలి

ప‌ట్ట‌ణాల్లో స్కై వే, హై వేలు వ‌స్తుంటే..అదివాసి గూడాల్లో కనీసం మ‌ట్టి రోడ్లు రాక‌పోతే స‌మాజంలో ఉన్న అంత‌రాలు ఎప్పుడు పోతాయి.

అందుకే అట‌వి చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాలి.

అడ‌వి ప్రాంతాల్లో భారి ప్రాజెక్టుల‌కు ఇచ్చిన‌ట్లుగానే శ‌ర‌వేగంగా అడ‌వి బిడ్డ‌ల అభివృద్దికి అనుమ‌తులివ్వాలి.

కొన్ని సార్లు స్ట్రిక్ట్ రూల్స్ వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తున్నాయి.

ఉద‌హ‌ర‌ణ‌కు ఆదిలాబాద్ లో ఒక గ్రామానికి ర‌హ‌దారి సదుపాయం లేదు. అక్క‌డ రోడ్డు వేసేందుకు రూ. 9 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని ఇంజ‌నీర్లు అంచ‌నా వేసారు. అట‌వి ప్రాంతం గుండా రోడ్డు వేయాల్సి వ‌స్తుంది. అందుకోసం రూ. 76 కోట్లు పెనాల్టి క‌ట్టాల‌ని అట‌వి శాఖ చెబుతోంది. ప్ర‌తి చోట ఇదే ప‌రిస్తితి.

*ఎఫ్ అంటే ఫారెస్టే కాదు..ఎఫ్ అంటే ఆదివాసీల ఫ్యూచ‌ర్ కూడా.

రెండిటిని సమన్వయం చేసి ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలపాలి

ఆ దిశలో ఈ రీజినల్ వర్క్ షాప్ కృషి చేయాలి

You cannot copy content of this page

Scroll to Top