మమత నర్సింగ్ హోం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ …
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మమత నర్సింగ్ హోం నూతన ఆసుపత్రి ప్రారంబోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు ఈ సందర్బంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ధనరాజ్ అగర్వాల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు మెరుగైన వైద్యoనిమిత్తం దూర ప్రాంతానికి వెళ్లకుండ అందుబాటులో వైద్య సేవలు అందించుటకు నూతన పరికరాలతో ఆసుపత్రి ప్రారంభించడం సంతోషకరమైన విషయమని వారు అన్నారు.అనంతరం దన్ రాజ్ అగర్వాల్ మాజీ మంత్రి, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ని సన్మానించారు. కార్యక్రమంలో PACS చైర్మన్ డొంగ్రే మారోతి పటేల్, అనిల్ రాథోడ్,మాజీ జడ్పి కో అప్షన్ సభ్యులు అంజాద్,బీఆర్ఏస్ పార్టీ సినియర్ నాయకులు సుపియన్,దీపక్ షేకావత్,మాజీ కో అప్షన్ సభ్యులు జీలాని బేగ్, కైలాష్ పటేల్,జమున బాయి,తదితరులు ఉన్నారు.
