సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బైరెడ్డి, బోయిళ్ళ
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని లక్ష్మీ నరసాపురం గ్రామంలో సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, బోయిళ్ల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు పోలు సుధాకర్ రెడ్డి సారధ్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో లక్ష్మీ నరసాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ మన్నేపల్లి విజయ శేఖర్, గాజులపల్లి వెంకటేశ్వర రెడ్డి, గవిరెడ్డి రమణారెడ్డి, గవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇల్లూరి శ్రీనివాసులు రెడ్డి, బోయిళ్ళ తిరుపతిరెడ్డి, గవిరెడ్డి శ్రీదేవి గ్రామస్తులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు
