ఎందరో మహనీయుల పోరాటాల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్టం -జిల్లా ఎస్పీ:*రావుల గిరిధర్
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
సేవా పతకాలు అందుకున్న పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ
వనపర్తి : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం జీవితాల్ని త్యాగం చేసిన అమరవీరుల పాత్ర ఎంతో ఉందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదకొండు సం.రాలు పూర్తిచేసుకుందన్నారు. ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా సాధించుకున్నదే.. తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజా రక్షణే ద్వేయంగా శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేయాలని సమాజం ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కృషి చేస్తున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని, సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని మరియు అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వనపర్తి జిల్లాకు ఇంకా మంచి పేరు, కీర్తి ప్రతిష్ట లు తీసుకురావాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు మహోన్నత సేవా, సేవా పతకాలు అందుకున్న పోలీసు సిబ్బంది ని జిల్లా ఎస్పీ అభినందించారు.
అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ, ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ, సునందన, నరేష్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ, కృష్ణయ్య, కొత్తకోట సీఐ,రాంబాబు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, సిసిఎస్ సీఐ, రవిపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
