ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి తన్నీరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.ఎంపీ రవిచంద్ర సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఆల వెంకటేశ్వర రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి హరీష్ రావు చేత కేక్ కట్ చేయించి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
