గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే..కూటమి ప్రభుత్వం నిధులిచ్చింది

TEJA NEWS

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే..కూటమి ప్రభుత్వం నిధులిచ్చింది : మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి

  • సాక్షిత : ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదల : ప్రత్తిపాటి
  • వివిధరకాల పనులకు రూ.9.45కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు : ప్రత్తిపాటి.
  • నియోజకవర్గ ప్రజల తరుపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి.

“చిలకలూరిపేట పట్టణంలోని ఏరియా వైద్యశాల (100 పడకల ఆసుపత్రి) అభివృద్ధికి సంబంధించిన నిధుల మంజూరు ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలతో పాటు ఆసుపత్రి అభివృద్ధి ఆవశ్యకతను, రోగుల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. ఆనాడే శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తాను అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖమంత్రి సత్యకుమార్ స్పందించారు. ప్రాధాన్యతల ప్రకారం వీలైనంత త్వరగా నిధులు విడుదలయ్యేలా చూస్తామని మంత్రి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా తాజాగా ప్రభుత్వం నుంచి రూ. 9.45కోట్లు విడుదలైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏరియా ఆసుపత్రిలోని సమస్యలు, రోగుల ఇబ్బందులపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ప్రజలు, వైద్యసిబ్బంది ఎన్నిసార్లు సమస్యల గురించి చెప్పినా, గత పాలకులు పట్టించుకోలేదు. కూటమిప్రభుత్వం ఏర్పడ్డాక సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేశాను. చేపట్టాల్సిన పనుల వివరాలతో సమగ్ర నివేదిక తయారుచేసి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖాధికారులకు అందించడం జరిగింది.

చేయబోతున్న అభివృద్ధి పనులు…

ఆ నిధులతో ఆసుపత్రి కాంపౌండ్ వాల్ పాటు, ఆసుపత్రిలో అంతర్గత సీ.సీ.రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. అలానే అంబులెన్స్ షెడ్, పార్కింగ్ షెడ్, బ్లడ్ బ్యాంక్ దోభీ ఘాట్ల నిర్మాణంతో పాటు. పాతభవనం మరమ్మతులు చేపట్టబోతున్నాం.అలానే వైద్యపరికరాలు, జనరేటర్, మోడర్న్ కిజెన్ ఏర్పాటు చేయనున్నాం. ఈ పనులన్నీ సకాలంలో పూర్తిచేసి, ఆసుపత్రి సిబ్బంది… రోగులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజల ఇబ్బందులను గ్రహించి ఆసుపత్రి అభివృద్ధిపనులకు నిధులు మంజూరుచేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలియచేశారు.

You cannot copy content of this page

Scroll to Top