వాహనాలకు ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్

TEJA NEWS

వాహనాలకు ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్
ప్రభుత్వ అధికారులు విద్యుత్ దొంగలు అయితే…!
సంక్షేమ ఆఫీసా లేక చార్జింగ్ స్టేషనా..?


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సహాయక సాంఘిక సంక్షేమ కార్యాలయం లో ఎలక్ట్రిక్ కారులకు చార్జింగ్ స్టేషన్ అడ్డాగా తయారు చేశారు. అధికారులు దర్జా గా కార్లలో ఇంటి నుంచి బయలుదేరి ఎంచక్కా ఆఫీస్ కార్యాలయాలో విద్యుత్ చౌర్య౦ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఛార్జింగ్ పెడితే వందలు దాటి వేలల్లో బిల్లు వచ్చి తడిసి మోపడౌతుందన్న కారణంతో చూసేవారేవరు అడిగే వారేవరు. అనే ధీమాతో ఎంచాక్క కార్యాలయాల్లోనే చార్జింగ్ స్టేషన్ గా ఏర్పాటు చేసుకున్నారు. పేదవాడికి 200 యూనిట్లు దాటిందంటే చాలు దాదాపు 1000 రూపాయలకు తగ్గకుండా బిల్లులు వేస్తున్న విద్యుత్ శాఖ మరి ఇలా విద్యుత్ చౌర్య౦ చేస్తున్న అధికార కార్యాలయాల పై విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
చార్జింగ్ స్టేషన్ అడ్డాగా మారిన సహాయ సాంఘిక సంక్షేమ కార్యాలయ అధికారులను ప్రశ్నించేదెవరు చర్యలు తీసుకునేది ఎవరో చూడాల్సిందే.

You cannot copy content of this page

Scroll to Top