పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే

TEJA NEWS

పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

సూర్యాపేట సమీపంలోని దూరాజ్ పల్లి లో జరుగుతున్న పెద్దగట్టు జాతరకు MLC కల్వకుంట్ల కవిత తో కలిసి జాతరకు వచ్చారు. మార్గమధ్యలో దారిపొడవునా యాదవ సంఘాల నాయకులు, BRS పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్దగట్టు వద్ద యాదవ సంఘాల నాయకులు, BRS పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లింగమంతుల స్వామివారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రం లో జరిగే రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర అని తెలిపారు.

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చే భక్తులను దృష్టి లో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత KCR ప్రభుత్వం14 కోట్ల రూపాయలు మంజూరు చేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతర నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించిందని, వాటిలో ఎన్ని నిధులు ఖర్చు చేశారని ప్రశ్నించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు సక్రమంగా లేవని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వలన వెలువడే దుర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నెల 20 వరకు జాతర జరుగుతుందని, ఈ రోజు నుండైనా వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ MLA లు భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పలువురు యాదవ సంఘాల నాయకులు, BRS పార్టీ నాయకులు ఉన్మారు.

You cannot copy content of this page

Scroll to Top