జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డిసిఆర్బి డిఎస్పి కి వినతి పత్రం

TEJA NEWS

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డిసిఆర్బి డిఎస్పి కి వినతి పత్రం అందజేసిన….. ఆదర్శ సేవా సంఘం

వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డి సి ఆర్ బి, డి ఎస్ పి ఉమామహేశ్వర్ కు ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా కేంద్రంగా మారిందని దీంతో ట్రాఫిక్ ఎక్కువైందని దీంతోపాటు సమస్యలతో పాటు ప్రమాదాలు కూడా అలాగే పెరిగాయని జిల్లా కేంద్రాల్లోని కొత్త బస్టాండు గాంధీ చౌక్ కమాన్ చౌరస్తా వివాకానంద చౌరస్తా ఆర్డీవో ఆఫీసు తదితర కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణ లోపం లేకుండా చూసుకోవాలని ప్రస్తుతం రాజీవ్ చౌరస్తాలో చెడిపోయిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను బాగు చేసి వినియోగంలోకి తీసుకురావాలని వినతి పత్రంలో కోరినట్లు అనంతరం డి సీ ఆర్బి.ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీతో చర్చించి ట్రాఫిక్ సిగ్నల్స్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లుఆదర్శ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top