ప్రమాద బాధితులకు అండగా ఉంటాం… ఎమ్మెల్యే డా” భూక్యా మురళి నాయక్

TEJA NEWS

ప్రమాద బాధితులకు అండగా ఉంటాం… ఎమ్మెల్యే డా” భూక్యా మురళి నాయక్

ఆసుపత్రిలో మృతుడు రాజు(30)భౌతిక దేహానికి నివాళులు అర్పించినా ఎమ్మెల్యే డా మురళీ నాయక్

ప్రమాదంలో గాయపడిన ఇద్దరీ పరిస్థితి విషమం గా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు..


మహబూబాబాద్ నియోజకవర్గం నిన్న రాత్రి వేంనూర్ గ్రామం శివారు రేగడి తండా వద్ద గ్రానైట్ లారీ అశోక్ లాండ్ వాహనాన్ని ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో రాజు (30)అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి…వారిని మహబూబాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు .విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మేల్యే డా భూక్యా మురళి నాయక్ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఉన్న రాజు భౌతికయానికి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులను హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా” భూక్యా మురళి నాయక్ మాట్లాడుతూ గ్రానైట్ లారీ ఓవర్ లోడ్,మద్యం మత్తులో రావడం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని.ఈ ప్రమాదనికి కారణమైన లారీ డ్రైవర్ పై క్వారీ యాజమాన్యం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇక ముందు క్వారీల నుండి వచ్చే వాహనాలు అతివేగం,ఓవర్ వాహనాలై అధికారులు దృష్టిపెట్టాలని ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రమాదంలో మరణించిన రాజు కుటుంబానికి అండగా ఉంటానని అంతేకాకుండా ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు అండగా ఉంటానని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు..

You cannot copy content of this page

Scroll to Top