పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలి.

TEJA NEWS

పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే డా మురళీ నాయక్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమిపూజ ముగ్గుపోసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్


మహబూబాబాద్ నియోజకవర్గం : గూడూరు మండల కేంద్రంలోని మధనపురం గ్రామ పంచాయతీలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటికి భూమి పూజ చేసి ముగ్గులు పోసి కొబ్బరికాయ కొట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్ కోసం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని ఆయన అన్నారు. గూడూరుకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబా బాద్ శాసనసభ్యులు భూక్య మురళి నాయక్ లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి 250 ఇండ్లను మంజూరు చేయాలని కోదామని, వెంటనే మంత్రి మంజూరు చేశారని తెలిపారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాలో 4విడతలలో 5లక్షలు రూపాయలు జమ అవుతాయి…
అందరం కలిసి కట్టుగా పని చేద్దాం పార్టీని బలోపేతం చేసుకుందాం…

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top