అట్టహాసంగా గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం

TEJA NEWS

అట్టహాసంగా గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ ….

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా..

ఇందిరమ్మ రాజ్యంలో పేదల స్వంత ఇంటి కల నెరవేరబోతుంది..

ఇల్లు మంజూరు అయిన వాళ్ళు దసరా నాటికీ గృహ ప్రవేశం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారలు ఎవరికి ఒక న్యాయ పైసా ఇవ్వదు ఇచ్చినట్లు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళజైలుకు పంపిస్తా…

నేరుగా లబ్ధిదారుల ఖాతాలో 4విడతలలో 5లక్షలు రూపాయలు జమ అవుతాయి…

అందరం కలిసి కట్టుగా పని చేద్దాం పార్టీని బలోపేతం చేసుకుందాం…

పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి…

ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల స్వంత ఇంటి కల సాకారం అవుతుందని గౌరవ మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ అన్నారు..


మహబూబాబాద్ నియోజకవర్గం

పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నేడు గూడూరు మండల పరిధిలోని పొనుగోడు, పడమటి తండ,రాములు తండ,చిర్రకుంట తండ గ్రామాల లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమిపూజ ముగ్గుపోసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

పొనుగోడు గ్రామంలో రైతు వేదిక కార్యాలయంలో నందు గూడూరు మండలానికి సంబందించిన (15) మంది లబ్ధిదారులకు రూ 1,501,1740/- విలువగల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డా.మురళీ నాయక్

వివిధ గ్రామాలకు సంబందించిన 46 మంది బాధితులకు మంజూరైన 12,64000/_ రూ సీఎం సహాయనిది చెక్కులను బాధితులకు పంపిణీ చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల 500కోట్లతో 4లక్షల 50వెల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 175కోట్లతో 3వేల 500ఇల్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక్కో ఇంటికి 5లక్షల చొప్పున నాలుగు విడతలలో నేరుగా లబ్ధిదారు ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు.

అధికారులు గ్రామాలలో లబ్ధిదారులను, గ్రామస్తులను వెంట పెట్టుకొని ఒకటికి రెండుసార్లు సర్వే చేసి ఎంపిక చేశారాని అన్నారు.అయితే అందరికీ ఒకేసారి ఇల్లు రావని, మొదటి విడతలో రాని వాళ్లకు రెండవ విడతలో అవకాశం వస్తుందని వివరించారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధైర్యపడవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని అన్నారు

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top