మావురాల ఎల్లమ్మ” దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …..
130 – సుభాష్ నగర్ జీడిమెట్ల డిపో వద్ద గల శ్రీశ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ దేవాలయంలో శివ హనుమాన్ స్యాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, మావురాల ఎల్లమ్మ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నిజాం పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
