కన్నుల పండువగా హిల్ కౌంటీ “శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం”….. ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి హిల్ కౌంటీ లోని “శ్రీ వెంకటేశ్వర దేవస్థానం” నందు నిర్వహించిన దేవాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, కోశాధికారి శ్రీదేవి, సభ్యులు భూపాల్ రెడ్డి, అజయ్ సాగి, పరిమళ, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు కాసాని సుధాకర్, గాజుల సుజాత, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాంబ శివ రెడ్డి, నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రదీప్ తాళ్లూరి, మహమ్మద్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు
