జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను తీసుకొచ్చింది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు.
యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MORTH వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి
వస్తుందన్నారు. వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ పాస్ను తీసుకొచ్చినట్లు
తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని, వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
