ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు వారు సానుకూలంగా స్పందించారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు..
అదేవిధంగా ఈనెల 28వ తేదీన దుండిగల్ గ్రామంలో మిద్దమైసమ్మ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే శ్రీశ్రీశ్రీ మిద్దమైసమ్మ దేవాలయ కుమ్మర్ల బోనాల జాతర మహోత్సవ కార్యక్రమ పోస్టర్ ను ఆలయ సంఘం ప్రెసిడెంట్ కుమ్మరి లక్ష్మి ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.
