ప్రధాని 11ఏళ్ల పాలనపై బీజేపీ ప్రచారం
** ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ
తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫోటో ప్రదర్శన బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక జీవకోన సర్కిల్లో జరిగినది. బీజేపీ జిల్లా కార్యదర్శి గుండాల గోపినాధ్ రెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన పైన కరపత్రాలను పంపిణీ చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బిజెపి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవి ప్రసాద్, బిజెపి యువమోర్చా నాయకులు పార్థసారథి, నాయకులు నాగేశ్వరరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
